శ్రీ లీల లైనప్ మాములుగా లేదుగా..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నితిన్ , వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో శ్రీ లీల ఇప్పటికే హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.
నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కబోయే అనగనగా ఒక రాజు ఆ సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది. బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. వారాహి చలన చిత్రం తెలుగు మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ కన్ఫామ్ అయ్యింది. ఇలా వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ శ్రీ లీల ముందుకు దూసుకుపోతుంది.