చిరంజీవికి... హీరోగా ఇంటరెస్ట్ లేదా...?
అయితే ఇప్పుడు చిరంజీవి వయసుకు తగిన పాత్రలు చేసే ఆలోచనలో ఉన్నారని హీరోగా పాత్రలు చేయడానికి ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్క సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే ఆ సినిమాల తర్వాత మాత్రమే హీరోగా వద్దు అని ఆలోచనలో ఉన్నారని మెహర్ రమేష్ తో సినిమా పూర్తయిన తర్వాత సైలెంట్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా దాదాపుగా పూర్తి కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీపావళి రోజున ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత దాదాపుగా ఇక హీరో పాత్రలకు గుడ్‌బై చెప్పి వయస్సుకు తగిన విధంగా పాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి అనే కామెంట్స్ వినపడుతున్నాయి. కొంత మంది హీరోలకు తండ్రి గా కూడా చిరంజీవి నటించే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి.