ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా ఈ మధ్య కాలంలో సరైన నిద్ర కూడా కరువైపోయిందంటే ఆశ్చర్యపోనిక్కర్లేదు. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని, అది కూడా ఎడమవైపు తిరిగి పడుకోవాలని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1.జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి..
మనం నిద్రించే సమయంలోఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల,జీర్ణక్రియ సక్రమంగా జరిగి,పేగుల నుంచి వ్యర్థాలు సహజంగా బయటికి నెట్టివేయబడతాయి.దీనివల్ల  పొట్ట సమస్యలు తగ్గి, అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
2.వెన్నెముక నొప్పి నివారించడానికి..
వెన్నెముక నొప్పితో బాధపడేవారు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల నొప్పిని తగ్గే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.ఈ వైపుకు తిరిగి నిద్రంచడం వల్ల,వెన్నెముక సహజ వక్రతను చేరుకొని, శరీర భారం పడినా, దాని నుంచి కలిగే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
3.గుండెనొప్పి నివారణకు..
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తనాలాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె పై ఒత్తిడి తగ్గుతుంది.శరీరం నుండి ప్రసరించే రక్తం ఒత్తిడి గుండెపై పడకుండా సహాయపడుతుంది.దీనితో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
4.గురకను తగ్గించడానికి..
చాలామంది గురక వల్ల నిద్రలేమి ఎదుర్కొంటూ ఉంటారు. వారికే కాక వారి పక్కన ఉన్న వారికి కూడా నిద్రకు భంగం కలిగిస్తుంటారు.ఎవరైనా గురక పెట్టిన ట్లయితే ఎడమ వైపున నిద్రించేలా తిరిగి పడుకోమని చెప్పాలి.దీనితో శ్వాసనాళాలు బాగా తెరిచినట్టు అయి,గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపుతో ఉన్నవారు కూడా ఎడమవైపుకు తిరిగి నిద్రించడం చాలా ఉత్తమం.దీని తో కడుపులోని బిడ్డకు రక్త ప్రసరణ బాగా జరిగి, శిశువు ఎదుగుదలకు దోహదపడుతుంది.
5.ప్యాంక్రియాజ్ పనితీరు మెరుగుపరచడానికి..
ప్యాంక్రియాజ్ శరీరంలో తయారయే వ్యర్థాలు, విషాన్ని తొలగిస్తుంది. ఎడమవైపు ఉన్న శోషరస కణుపులను మరింత సక్రమంగా పనిచేయడానికి అనుమతించడం వల్ల,శోషరస వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి మేలు చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎడమ వైపు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: