చరిత్రలో ఈరోజు : 31-05-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

మే 31వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు జరిగిన ముఖ్య సంఘటనలు సంభవించిన మరణాలు ఏంటో తెలుసుకుందాం రండి..

 

 మారిస్ అల్లైస్  జననం : సుప్రసిద్ధ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అయిన మారిస్ అల్లైస్  1911 మే 31 వ తేదీన జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గాను 1988 లో నోబెల్ బహుమతి పొందారు. ఈయన  ఆర్థిక శాస్త్రంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకు వచ్చారు. కాగా ఈయన  2010 అక్టోబర్ 9వ తేదీన పరమపదించారు.

 

 ఘట్టమనేని కృష్ణ జననం : ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ కృష్ణగా  తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఘట్టమనేని కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. ఈయన 1942 మే 31వ తేదీన జన్మించారు.తెలుగు చిత్ర పరిశ్రమలు కృష్ణ అనే పేరుతో అందరికీ సుపరిచితుడు. 1970-80 లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎన్నో ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించి తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా మారిపోయారు కృష్ణ. 1964 కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన కృష్ణకు 1964 65 లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. ఇక ఆ తర్వాత మూడవ సినిమా గూడచారి 116 సినిమా కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు కృష్ణ. 340కి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. 1970లలో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ. ఏకంగా 16 సినిమాలకి కూడా దర్శకుడిగా చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను పరిచయం చేశాయి . ముఖ్యంగా తొలి జేమ్స్ బాండ్ సినిమా గూడచారి 116... తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు... తొలి స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు... తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం లాంటి సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ నటించినవే . ఇలా ఎన్నో ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి...  నటుడిగా హీరోగా దర్శకుడిగా నిర్మాతగా తన ప్రస్థానాన్ని  విజయవంతంగా కొనసాగించారు. ప్రతి ఏడాదికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. ఇక ప్రస్తుతం కృష్ణ కుటుంబం నుంచి మహేష్ బాబు రమేష్ బాబు సుధీర్ బాబు సినిమా రంగంలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా కృష్ణ భార్య విజయనిర్మల కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా నిర్మాతగా దర్శకురాలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. భారత పార్లమెంటు సభ్యుడిగా కూడా సూపర్ స్టార్ కృష్ణ పని చేసారు.

 

 దువ్వూరి సుబ్బమ్మ మరణం : స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ అయిన దువ్వూరి సుబ్బమ్మ 1964 మే 31వ తేదీన మరణించారు. ఇక స్వాతంత్రోద్యమంలో దువ్వూరి సుబ్బమ్మ ఎంతగానో కీలక పాత్ర పోషించింది.  1922 లో సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది దువ్వూరి సుబ్బమ్మ, అంతేకాకుండా ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. ఒకానొక సమయంలో దువ్వూరు సుబ్బమ్మను  ఆంగ్లేయులు బంధించి క్షమాపణ చెబితే వదిలిపెడతామని చెప్పగా నా కాలి గోరు కూడా అలా చేయ్యద్దు అని  నిస్సంకోచంగా చెప్పిన ధైర్యవంతురాలు దువ్వూరి సుబ్బమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: