నిద్రలేమితో బాధపడుతున్నారా ?

Edari Rama Krishna
ఇప్పుడు ఉన్న టెన్షన్ వాతావరణంలో బయటకు వెళ్లి ఇంటికి వస్తే చాలు తలనొప్పి, కాళ్ల నొప్పితో పాటు ప్రశాంతంగా నిద్ర పోదామన్న వీలు లేకుండా పోతుంది.  బాగా అలసిపోవడం వల్ల నిద్రలేమి బాగా ఇబ్బందులు పడుతున్నారు.  మీకు శరీరంలో మెగ్నీషియం శాతం బాగా లోపించి ఉండవచ్చు. తగినంత మెగ్నీషియం శరీరానికి చాలా శక్తినిస్తుంది.

ఇది శరీరంలో సరిపడినంత లేనపుడు కణాల్లో కాల్షియం శాతం పెరుగుతుంది. ఫలితంగా ప్రధానమైన హార్మోన్లు, న్యూట్రోట్రాన్సిమిటర్స్ పై దీని తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కొంత సమయం తర్వాత రక్తనాళాలు బాగా ముడుచుకుపోయి తలనొప్పి ప్రారంభమవుతుంది.  మెగ్నీషియం పరిమాణం బాగా తక్కువైతే బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఎక్కువవుతుంది.

దానివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఈ సమస్యలనుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మెగ్నీషియం పుష్కలంగా ఉండే పధార్థాలని తీసుకోవాలి. అంటే మామిడిపళ్ళు, తోటకూర, గసగసాలు, ద్రాక్ష, చేపలు, బంగాళాదుంపలు, అన్ని రకాల చిరుధాన్యాలు తప్పకుండా తినాలి. అప్పడు తలనొప్పికాదు, నిద్రలేమితో బాధపడుతున్నావారు భాధ నుంచి సులభంగా బయటపడుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: