టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న
యువ నటులలో
విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించినప్పటికీ పెళ్లి చూపులు
మూవీ తో
హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన
అర్జున్ రెడ్డి , టాక్సీ వాలా , గీత గోవిందం సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకొని
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇక గీత గోవిందం సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు.
కొంత కాలం క్రితమే ఈయన ది ఫ్యామిలీ మెన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం ఈ నటుడు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ "విడి 12" అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ
మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ
మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్
ఎపిసోడ్ లను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో
విజయ్ సరసన
హీరోయిన్ గా తీసుకోవడానికి ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరు మరెవరో కాదు ప్రేమలు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న మమిత బైజు , ప్రస్తుతం
రవితేజ హీరోగా రూపొందుతున్న
మిస్టర్ బచ్చన్ మూవీలో
హీరోయిన్ గా నటిస్తున్న భాగ్య
శ్రీ బోర్స్ ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఈ సినిమాలో
విజయ్ కి జోడిగా తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లు , అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.