పుష్ప సెకండ్ సింగల్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగినటువంటి నటులలో ఒకరు అయినటువంటి ఫాహాధ్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి వరుసగా పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని మొదటి పాట అయినటువంటి పుష్ప పుష్ప అంటూ సాగే పాటను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని రెండవ సాంగ్ అయినటువంటి సూసైకి అనే సాంగ్ ను విడుదల చేశారు.

ఇకపోతే ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 10.97 మిలియన్ వ్యూస్ , 522 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ 24 గంటల్లో లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ ను కంప్లీట్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: