"గం గం గణేశా" అన్ని కోట్లు సాధిస్తేనే హిట్ అనిపించుకుంటుంది..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఆనంద దేవరకొండ ఒకరు. ఇకపోతే ఈ నటుడు పోయిన సంవత్సరం ఓ బేబీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఈయన క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగింది. ఇకపోతే బేబీ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఈ నటుడు గం గం గణేశా కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఈ సినిమా రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇకపోతే బేబీ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఆనంద్ హీరో గా రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తం లోనే ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాకు ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ కలక్షన్ లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి దాదాపుగా 4.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లు , మరో కోటి రూపాయలు ప్రపంచ వ్యాప్తంగా జరిగినట్లు దానితో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా 6 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నట్లు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల షేర్ కలక్షన్ లను గనుక రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. మరి బేబీ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఆనంద్ నటించిన గం గం గణేశా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad

సంబంధిత వార్తలు: