"ఎన్బికె 109" సెకండ్ గ్లిమ్స్ ఆ తేదీనే..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నటసింహం బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వాల్తేరు వీరయ్య మూవీ తో సూపర్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న బాబీ దర్శకత్వంలో మూవీ ని స్టార్ట్ చేశాడు. ఇకపోతే బాలయ్య , బేబీ కాంబో మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా తెరకేక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క షూటింగ్ ను "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇక కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం ఫస్ట్ గ్లిమ్స్ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ ,  అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆ వీడియోకు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లిమ్స్ విడుదల అయ్యే చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి సెకండ్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు తెలుస్తోంది. ఈ మూవీలోని సెకండ్ గ్లిమ్స్ వీడియోలు జూన్ 10 వ తేదీన విడుదల చేసేందుకు గాను మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: