అఫీషియల్ : "మనమే" ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి శర్వానంద్ ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శర్వానంద్ "మనమే" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.
 

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను జూన్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ నుండి.చిత్ర బృందం జూన్ 1 వ తేదీన విడుదల చేసే ట్రైలర్ కూడా కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగి అవకాశం ఉంది.

మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో , ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే శర్వానంద్ ఈ మూవీ తో పాటు మరికొన్ని సినిమాలలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ మూవీ ల షూటింగ్ లు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: