రేపు విడుదల కాబోయే మూవీల సెన్సార్... రన్ టైమ్ వివరాలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
రేపు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ మూడు సినిమాలు ఏవి ..? వాటి రన్ టైం , సెన్సార్ వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గం గం గణేశా : ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ సినిమాను రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
భజే భాయు వేగం : టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ హీరో గా రూపొందిన ఈ సినిమాను రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల నిడివితో  ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే ఈ ముగ్గురు హీరోలు కూడా ఆకరుగా నటించిన మూవీలతో మంచి విజయాలను అందుకుని ఉండడం , వీరు నటించిన ఈ ఈ మూడు మూవీ లప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: