అఫిషియల్ : కమల్ "థగ్ లైఫ్" లో ఆ క్రేజీ నటుడు..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో దాదాపు 28 సంవత్సరాల క్రితం నాయకుడు అనే సినిమా వచ్చింది . ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఈ సినిమా లోని కమల్ నటనకు , ఈ మూవీ ని తేరకెక్కించిన విధానానికి దర్శకుడు మణిరత్నం కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి . ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమా తర్వాత కమల్ , మణిరత్నం కాంబో లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇకపోతే ప్రస్తుతం విరి కాంబో లో థగ్ లైఫ్ అరే మూవీ రూపొందుతోంది.
 

ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోని కొన్ని రోజుల క్రితమే విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత తమిళ నాడు లో ఎలక్షన్స్ జరగడంతో కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మళ్ళీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి శింబు ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు మూవీ యూనిట్ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక కమల్ , మణిరత్నం కాంబోలో చాలా సంవత్సరాల తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: