ఏపీలో కూటమే కొడుతుందట.. బాబు పత్రిక లెక్కలు వింటే అవాక్కవ్వాల్సిందే!

Reddy P Rajasekhar
ఏపీలో కూటమే అధికారంలోకి రానుందని టీడీపీ అనుకూల పత్రిక తాజాగా కథనాన్ని ప్రచురించింది. జగన్ 151 స్థానాలను మించి గెలుస్తామని చెబుతుంటే బాబు అనుకూల పత్రిక మాత్రం కూటమికి 104 నుంచి 107 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతోంది. ఈ సీట్ల సంఖ్య 2014 సంవత్సరంలో కూటమి సాధించిన సీట్ల సంఖ్య కంటే తక్కువ కావడం గమనార్హం. వైసీపీ 70 నుంచి 73 స్థానాల్లో గెలుస్తుందంటూ ఈ పత్రిక చెబుతోంది.
 
అయితే బాబు పత్రికలు అంటే వాస్తవాలను సగం దాచేసి అవాస్తవాలను మాత్రమే ప్రచురిస్తాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ పత్రికే వైసీపీకి 73 సీట్లు అని చెబుతోందంటే వైసీపీ సులువుగానే అధికారంలోకి రావడం ఖాయమని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయల చొప్పున చాలా చోట్ల పందేలు జరుగుతున్నాయని సమాచారం.
 
కూటమే కొడుతుందని టీడీపీ అనుకూల పత్రికలు చెబుతున్నా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ విషయాలను నమ్మడం లేదని తెలుస్తోంది. పందేలు చట్టవిరుద్ధం అయినా విజయావకాశాలు, మెజారిటీలపై పందేలు జరుగుతున్నాయని భోగట్టా. షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయని కూడా పందేలు కాస్తున్నారని సమాచారం అందుతోంది. జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.
 
ఏపీ పందేల విషయంలో జోరు పెరగగా 20,000 కోట్ల రూపాయలు పందేలు కాస్తున్నారని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఏపీ ఫలితాలకు సంబంధించి బెట్టింగ్స్ కొనసాగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థులు పార్టీ మారతారంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నా ఆ కథనాలను నమ్మే స్థితిలో ఏపీ ఓటర్లు లేరు. కూటమి కాన్ఫిడెన్స్ డొల్లేనని టీడీపీ అనుకూల పత్రిక కథనంతో తేలిపోయింది. ఎన్నికల ఫలితాల సమయానికి బాబులో కాన్ఫిడెన్స్ పూర్తిస్థాయిలో తగ్గిపోతుందేమో అని అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: