'టిల్లు క్యూబ్' కోసం ఆ స్టార్ హీరోను రంగంలోకి దింపిన సిద్దు..!?

Anilkumar
టాలీవుడ్  సినిమా ఇండస్ట్రీలో స్టార్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ డిజె టిలు సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా కంటే ముందు గుంటూరు టాకీస్ సినిమా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకో లేకపోయాడు. ఆ సినిమాతో తన కామెడీ టైమింగ్ ఏంటో అందరికీ చూపించినప్పటికీ తనకి అంతగా క్రేజ్ దక్కలేదు. దాని తర్వాత కూడా వరుస సినిమాల్లో నటించాడు. కానీ సిద్దుకి ఏ సినిమా ఇవ్వని గుర్తింపు డీజే టిల్లు సినిమా ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ

 సినిమాతోనే సిద్దు ను అందరూ గుర్తుపట్టడం ప్రారంభించారు. ఇక ఆయన నటించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో దీనికి సీక్వల్ గా టిల్లు స్క్వేర్ సైతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకి మూడవ భాగం కూడా సిద్ధం చేస్తున్నారు. టిల్లు  క్యూబ్ అనే టైటిల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా ముందు సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్న

 వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే టిల్లు క్యూబ్ లో ఒక స్టార్ హీరో ను కీలక పాత్ర కోసం తీసుకుంటున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఎటువంటి కీలకపాత్రలో నటిస్తారు.. అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.. మరి ఆ స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తాడా లేక అతిధి  పాత్రలో నటిస్తాడా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. టిల్లు వన్ టు సినిమాలతో భారీ కలెక్షన్స్ వసూలు చేసిన టీం ఇప్పుడు దాదాపుగా 200 కోట్లకు పైగా వసూలు చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం జాక్ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే  ఈ సినిమా విడుదల కూడా కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: