టీవీ: హీరోతో బుల్లితెర నటి ఎఫైర్.. అందుకే విడాకులు ఇచ్చిందా..?

Divya
ఈమధ్య కాలంలో వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకుల బాటపడుతున్నారు.. గతంలో ప్రేమ గురించి ఎన్నో సూక్తులు చెప్పినటువంటి వారు కూడా విడాకులు తీసుకొని విడిపోయి ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా సినీ టీవీ ఇండస్ట్రీలో అయితే తరచూ విడాకుల వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. తాజాగా బుల్లితెర నటి శిరీష సైతం తన భర్తకు విడాకులు ఇస్తూ ప్రకటించి అందరికీ ఒకసారిగా షాక్ ఇచ్చింది.. మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిరీష బ్యాక్ టు బ్యాక్ వరుస సీరియల్స్ లో నటించింది.

అలా శిరీష కెరియర్ లో మొగలిరేకులు, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, నాతిచరామి తదితర సీరియల్స్ లో కూడా నటించింది. అలా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నవీన్ వల్లభనేని వివాహం చేసుకొంది. వీరికి ఒక బాబు కూడా జన్మించారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా శిరీష తన భర్త నుంచి విడిపోవడానికి ఒక ముఖ్య కారణం ఉందంటూ పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శిరీష ఒక స్టార్ హీరో వల్లే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శిరీష ఒక సీరియల్ స్టార్ హీరోతో లవ్ లో ఉండడంతో తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుందని గతంలో కూడా ఒక ప్రముఖ ఛానల్ స్టేజి పైన తన భర్త పైన ఉన్న ప్రేమను తెలియజేసింది.. అటువంటి శిరీష ఇప్పుడు ఒక్కసారిగా తన భర్తతో విడిపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎందుకు విడిపోయారని విషయం పైన ఆరా తీయగా శిరీష ఒక సీరియల్ స్టార్ హీరో తో లవ్ లో ఉందని పాస్టర్ హీరో వల్లే ఈమె విడాకుల బాట పట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరో మాత్రం పేరు తెలియలేదు.. ప్రస్తుతం ఈ విషయం అయితే బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: