'ఐదేళ్లు గా ప్రేమలో ' ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా..!?

Anilkumar
బుల్లితెరపై లేడీ కమెడియన్ గా తనకంటు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది జబర్దస్త్ ఫైమా. పటాస్ షో తో  ఎంట్రీ ఇచ్చిన ఈ క్వీన్ జబర్దస్త్ షో తో సెలబ్రిటీ రేంజ్ గుర్తింపు సంపాదించుకుంది. తనదైన కామెడీ పంచులు కామెడీ టైమింగ్  ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది. ముఖ్యంగా జబర్దస్త్ లో ప్రవీణ్ తో ఆమె చేసిన స్కిట్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఆన్ స్క్రీన్ పై వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు ప్రచారం కూడా చేశారు. ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకోవడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్లుండి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అని

 వీరిద్దరూ విడిపోయారు అని కొన్ని కారణాలవల్ల బ్రేకప్ చెప్పుకున్నారు అని వార్తలు వినిపించాయి. కాగా ఇటీవల ఈ విషయంపై ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈ విషయంపై స్పందిస్తూ ప్రవీణ్ తో కొన్ని కారణాల వల్ల విడిపోయాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇంతలోనే తన అభిమానులకి ఊహించిన షాక్ ఇచ్చింది  ఫైమా. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. దానితో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  తాజాగా ఫైమా తన బాయ్ ఫ్రెండ్ తో తన పుట్టినరోజుకి సంబంధించిన సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఇందులో భాగంగానే తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను

 సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరిచయం చేసింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలని ప్రవీణ్ నాయక్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్ లో.. "నా ప్రియమైన ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా ప్రేమ మొదలయ్య ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయో అసలు తెలియదు నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటాను"  అంటూ ప్రవీణ్ నాయక్ పోస్టులో పేర్కొన్నాడు.  ఫైమా కూడా  ఈ ఫోటోలకు స్పందిస్తూ తన సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది. దీనితో ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నటిజెన్స్ ఎవరికీ తెలియకుండా ఐదు సంవత్సరాలు ఎలా.. అనే కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అప్పుడే ప్రవీణ్ నువ్వు మర్చిపోయావా.. అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: