కొన్నిసార్లు అలాంటి పని కూడా చెయ్యక తప్పదు.. జాన్వీ కపూర్..!?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ  ఇస్తున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న   సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికైంది. ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వి. ఈ నేపథ్యంలోనే జాన్వీ చేసిన పలు సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో కొన్ని

 విషయాలను షేర్ చేసుకుంది. అదేంటంటే ఏది ఊరికే రాదు 100% రిజల్ట్ రావాలి అంటే 101% కష్టపడాలి అని చెప్పింది. అంతేకాదు కొన్నిసార్లు ఆ కష్టం మెంటల్ గా కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఫిజికల్ గా కూడా ఉండొచ్చు అని చెప్పింది. ఏదేమైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అన్న విషయాన్ని తాజాగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల రిలీజ్ తో బిజీగా ఉంది జాన్వి. అందులో భాగంగానే 2024 తనకి చాలా స్పెషల్ అని ప్రతి ఒక్కరికి చెప్తుంది. అంతేకాదు ఈ ఏడాది టాలీవుడ్ లో ఆమె చేసేరెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు. అందులోనూ స్టార్ హీరో సినిమాలు.  అంతేకాదు నార్త్ లో

 సైతం తనకి ఈ ఏడాది చాలా కీలకమని చెబుతోంది. అక్కడ ఆమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ఈ ఏడాది విడుదల కావడాని కి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ లో భాగంగా తన లక్కీ నెంబర్ 6 అని ఉన్న ఒక షర్ట్ ని ధరించింది. ఎలాగైనా దీంతో భారీ విజయాన్ని అందుకోవాలి అని చూస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం దాదాపుగా రెండేళ్లపాటు ట్రైనింగ్ తీసుకుందట జాన్వి. మరి దీనికోసం రెండేళ్ల పాటు తన టైం ను కేటాయించడం అన్నది తన జీవితంలో మర్చిపోలేని సన్నివేశం అని అంటుంది. అలా ప్రాక్టీస్ చేసి చేసి తన రెండు చేతులు ఇక నుండి పనిచేయవేమో అన్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అంతలా దీని కోసం కఠినమైన శిక్షణ తీసుకుందట జాన్వి కపూర్ ఎంత కష్టపడ్డా దీనికి ఫలితం వచ్చిన రోజు ఈ కష్టం అసలు గుర్తుండదు అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది జాన్వి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: