ఈ గింజలు చాలు.. మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే?

Purushottham Vinay
కొత్తిమీర గింజలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మనలో చాలా మంది కూడా ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతుంటారు. అయితే కొత్తిమీర గింజలు ఇలాంటి వారికి బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కొత్తిమీర గింజల నీటిని రోజూ తీసుకోవడం వల్ల నివారించవచ్చు. కొత్తిమీర గింజల డ్రింక్‌ ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా 1 టీస్పూన్ కొత్తిమీర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. రుచి కోసం కొంచెం చక్కెర లేదా తేనె చేర్చుకోని తీసుకోవచ్చు.ఇంకా ఈ కొత్తిమీర గింజల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ కొత్తిమీర గింజల నీటిని తాగడం వలన వివిధ రకాల ఫ్లూ, అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. కొత్తిమీర గింజలు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ తొలగిపోతాయి.


మన శరీరం డిటాక్సిఫై అవుతుంది.జీర్ణ సమస్యలకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర గింజల్లో నానబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ పోషకాలతో నిండి ఉంటాయి. కొత్తిమీర గింజల్లో విటమిన్ ఎ, సి, కె ఉంటాయి. కొత్తిమీర విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.విపరీతమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే వేసవిలో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం వీటిని వండిన కూరల్లో కలుపుకొని తిన్నా లేదా వాటిని పచ్చిగా తిన్నా..ఇంకా ఏ రూపంలో తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: