"ప్రతినిధి 2" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
నారా రోహిత్ తాజాగా ప్రతినిధి 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట పోయిన నెల 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ యూనిట్ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. అలాగే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు.

ఇక ఈ సినిమాకు సెన్సార్ బృందం నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ ని 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల మంచి విజయం అందుకున్న ప్రతినిధి మూవీ కి కొనసాగింపుగా రూపొందడం , అలాగే ప్రతినిధి 2 కి సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియాలి అంటే మే 10 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే నారా రోహిత్ కూడా సినిమాలకు చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నాడు.

చాలా సంవత్సరాల తర్వాత రోహిత్ నటించిన మూవీ ఇది. మరి ప్రతినిధి 2 తో రోహిత్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపును అందుకుంటాడో చూడాలి. ఈ మూవీకి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nr

సంబంధిత వార్తలు: