గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెన్సార్ తోనే ఆ విషయంపై క్లారిటీ చేసిన యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మణులలో ఒకరు అయినటువంటి నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ మూవీ ట్రైలర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను యూనిట్ చూపించింది. అలాగే కొన్ని బిప్ అనే డైలాగ్ పడే అవకాశం ఉన్న డైలాగులు కూడా ఈ ట్రైలర్ లో విశ్వక్ చెప్పాడు. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీ అతి దగ్గర పడిన నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా యు / ఏ సర్టిఫికెట్ లభించింది అంటేనే ఈ మూవీ లో భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి అని అర్థం , కాకపోతే ఈ సినిమా ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు , డైలాగులు చూసిన తర్వాత ఈ మూవీ కి "ఏ"  సర్టిఫికెట్ వస్తుంది అని కూడా కొంత మంది అనుకున్నారు. కానీ అలా రాలేదు. దానితోనే ఈ సినిమాలో మరి అంత వైలెన్స్ లేదు అని అర్థం అవుతుంది. రెండు రోజుల క్రితం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. బాలకృష్ణ ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమా పై అంచనాలు కూడా మరింతగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs

సంబంధిత వార్తలు: