ఏపీ: మంత్రి పెద్దిరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..??

Suma Kallamadi
రాజకీయాల్లో చంద్రబాబు లాంటి తలపండినా నేతలు ఎత్తులు తల ఎత్తులు ఎప్పటికప్పుడు వేస్తూ ప్రత్యర్ధులను ఇరకాటంలో పడేస్తుంటారు. అయితే జగన్ తర్వాత చంద్రబాబు ఎక్కువగా టార్గెట్ చేసేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పుకోవచ్చు. మంత్రి పెద్దిరెడ్డి ఏపీలో చాలా ఇన్‌ఫ్లుయెన్స్‌ కలిగి ఉన్నారు. ఆయనకు ఇబ్బంది కలిగించాలనే పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను బరిలోకి దింపారు. ఆయన పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారు.
అరాచకాలు, అక్రమాలు, రౌడీయిజంతో రెచ్చిపోతున్న రామచంద్రారెడ్డిని గద్దె దింపాలి అని పుంగనూరు వాసుల  ముందు పెద్ద స్పీచ్ లు ఇస్తున్నారు అంతే కాదు వారిని ఆకట్టుకునేలా మంచి హామీలను కూడా ప్రకటించారు. అయితే రామచంద్రారెడ్డి తన ఇలాకాలో ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఎదగనివ్వరు. అసలు తిరగనివ్వరు కూడా. బోడె రామచంద్ర యాదవ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయనపై ఇటీవల పెద్దిరెడ్డి అనుచరులు భయంకరమైన దాడులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలు జరిగినప్పుడు పోలీస్‌లు వైసీపీ గుండాల కే సహాయం చేశారని, తమకు అన్యాయం జరిగిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు రామచంద్ర యాదవ్.
దీనివల్ల డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. అంతేకాదు పలమనేరు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి, సదుం ఎస్‌ఐ మారుతీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వీరు స్వామి భక్తి చూపిస్తూ పెద్దిరెడ్డికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపించారు. వైసీపీకి మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని సైడ్ చేయాలనేది చంద్రబాబు ఫ్యాన్ అందులో ఆయన సక్సెస్ అయ్యారు. పుంగనూరులో ఏ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకూడదని కూడా అనుకున్నారు కానీ దానివల్ల వారి ప్లాన్ మరి బహిరంగంగా కనిపిస్తుందని బీసీవై నేతతో పాటు తమ సొంత నేతను కూడా నిలబెట్టారు. ఈసీ తీసుకున్న రీసెంట్ చర్యల కారణంగా అటు అధికారులకు ఇటు పెద్దిరెడ్డికి ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: