ఏపీ : అనుమతిస్తే విదేశాలకు పోతానంటున్న జగన్.!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలకు  పోలింగ్ జరగనుంది.మరో రెండు రోజుల్లో పార్టీ ప్రచారాలు కూడా చివరి దశకు చేరుకోనున్నాయి. అయితే ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎన్నికల అనంతరం వెళ్లాలనుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఎన్నికల తర్వాత రాజకీయాలకు కొంచం బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడిపే ఆలోచనలో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌ సీబీఐ కోర్టు అనుమతి కోరారు.ఈ నెల 17 వ తేదీ నుంచి జూన్ ఒకటోవ తేదీ మధ్య లండన్ తో పాటు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.అక్రమాస్తుల ఎదురుకుంటున్న కేసు నేపథ్యంలో సీఎం జగన్‌పై సీబీఐ దాదాపు ముప్పైయి ఎనిమిది కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు బెయల్ షరతుల్లో పేర్కొంది. అందుకే ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు బెయల్ షరతుల్లో పేర్కొంది.
 దాంట్లో భాగంగానే తన విదేశీ పర్యటనకు సంబంధించి అడ్డుగా ఉన్న బెల్ను సడలింపు చేయాలని జగన్ తరఫున బృందం కోరారు.సీఎం జగన్ పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐను ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి (గురువారం)వాయిదా వేసింది.అయితే జగన్ లండన్కు వెళ్లడానికి కారణం అక్కడ చదువుతున్న తన ఇద్దరు కూతుర్లతో గడపడానికే అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్, భారతి మే 15న లండన్ వెళ్లి 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. అక్కడ తన ఇద్దరు కూతుళ్లతో ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేసే అవకాశం ఉంది. జూన్ 4న జరిగే కౌంటింగ్‌కు 4 రోజుల ముందు జగన్ తిరిగి రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: