"ఇండియన్ 2" లేట్ కి ఇంత పెద్ద కారణం ఉందా..?

Pulgam Srinivas
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తెలుగు లో భారతీయుడు పేరుతో విడుదల చేయగా ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ అయిన చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇండియన్ 2 అనే మూవీ ని మొదలు పెట్టాడు.

ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తమిళ్ లో ఇండియన్ 2 అనే పేరుతో విడుదల చేయనుండగా ... తెలుగు లో భారతీయుడు 2 అనే పేరుతో విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది అని ఈ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం పనులు మిగిలి ఉన్నాయి అనే కారణంతో ఈ మూవీ ని జూన్ లో కాకుండా జూలై లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాను జూలై లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం శంకర్ ఇప్పటికే షూటింగ్ మొత్తం ముగిసిన కమల్ పై ఓ సాంగును చిత్రీకరించాలి అనుకుంటున్నట్లు , ఆ సాంగ్ షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని ముగిసకే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: