వామ్మో.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు దగ్గరలో ఉంటే.. ఇంత ప్రమాదమా?

praveen
ఇటీవల కాలంలో మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే మనిషి తన జీవనశైలిని కూడా మార్చుకుంటూ ఉన్నాడు. ఇక ఇలా మార్చుకుంటూన్న వాటిలో ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఇంట్లో వండిన పౌష్టికాహారాన్ని తినడానికి మాత్రమే జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ రెస్టారెంట్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో.. ఇక అవసరం ఉన్నా లేకపోయినా రెస్టారెంట్లలో ఉండే మసాలాలు దట్టించిన ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది అయితే పిజ్జాలు బర్గర్లు అంటూ పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బానిసలుగా మారిపోతున్నారు.

 ఇక ప్రతిరోజు ఇలాంటివే తింటూ చివరికి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారు అనే విషయం తెలిసిందే  అయితే నేటి రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో భాగంగా మారిపోయిన ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఫాస్ట్ ఫుడ్ అని చెప్పాలి. అతి తక్కువ ధరకే దొరికే ఈ మసాలాలు దట్టించిన ఆయిల్ ఫుడ్ ఇక అందరికీ ఇష్టమైన ఆహారంగా మారిపోయింది. దీంతో ఇక ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా ఫాస్ట్ ఫుడ్ తినడానికి తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు అందరు. అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్ కారణంగా చివరికి అనారోగ్యం బారిన పడుతూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు అని చెప్పాలి. అయితే ఫాస్ట్ ఫుడ్ అనేది ఎంత ప్రమాదకరమైనది అన్న విషయం పై ఎప్పటికే ఎన్నో అధ్యయనాలు జరిగాయి.

 అయితే ఇక్కడ నిర్వహించిన అధ్యయనంలో మరో సరికొత్త విషయం కూడా వెళ్లడైంది. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కు దగ్గరగా నివసించే వారికి ప్రమాదం కాస్త ఎక్కువగా పొంచి ఉందని బ్రిటిష్ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కు దగ్గరగా ఉంటే ఇక ఈ ప్రమాదకర ఆహారం తినే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో వెళ్లడైంది. ఈ ఫుడ్ తినే వారిలో చనిపోయే ప్రమాదం 16% అధికమని.. పబ్, బార్స్  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువగా ఉండే చోట ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది అంటూ అధ్యయనంలో బయటపడిందట. అయితే ఈ అధ్యయనంలో మొత్తంగా ఐదు లక్షల మంది పాల్గొనగా ఇందులో ఏకంగా 13,000 మంది హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: