మీ పిల్లలు పీచు మిఠాయి తింటున్నారా.. ఈ విషయం తప్పక తెలుసుకోండి?

praveen
సాధారణంగా పిల్లలు చిరుతిళ్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంట్లో తల్లులు ఎన్ని రకాల వెరైటీలు చేసిపెట్టిన ఇక చిరుతిల్లు తినడానికే ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఇలా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే చిరుతీళ్ళలో అటు పీచు మీఠాయి కూడా ఒకటి. కేవలం పిల్లలు మాత్రమేనా పెద్దవాళ్లు కూడా ఇలా పీచు మిఠాయి సరదాగా తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఫీచు మిఠాయి కనిపించింది అంటే చాలు ఇక అందరి నోరు ఊరిపోతూ ఉంటుంది.

 మనదేశంలో బాగా ఫేమస్ అయిన పానీ పూరిని ఎలా అయితే అందరూ ఇష్టపడుతూ ఉంటారో.. పీచు మిఠాయిని కూడా అలాగే ఇష్టపడుతూ ఉంటారో అలాగే ఇక ఈ పీచు మిఠాయిలు చూస్తే వెంటనే కొనుక్కొని ఇక నోట్లో వేసుకొని హాయిగా ఆరగించాలి అని ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక చిన్న పిల్లలు ఇలాంటి పీచు మిఠాయి చూసినప్పుడు కొనిచ్చే వరకు ఎంతలా మారం చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం ఒకప్పుడు తెలుపు రంగులో మాత్రమే ఇలాంటి పీచు మిఠాయి కనిపించేది. కానీ ఇప్పుడు ఎన్నో రకాల రంగుల్లో కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఇలా పీచు మిఠాయి రంగురంగుల్లో కనిపించేందుకు ఎన్నో రసాయనాలను వాడుతున్నారట. పీచు మిఠాయి యొక్క స్వచ్ఛతను కోల్పోకుండా రంగురంగుల్లో ఉండేందుకు రసాయనాలను వాడుతున్నట్లు తాజా పరిశోధనలో తెలిసింది. ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా తేలడంతో తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది అని చెప్పాలి. అయితే గత వారమే అటు పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక ఈ మిఠాయి పై నిషేధం విధించింది ఇక ఇప్పుడు తమిళ నాడు ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పీచు మిఠాయి తినడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: