తండ్రి కూలి.. కోచింగ్ కూడా లేదు.. అయినా 4 ప్రభుత్వ ఉద్యోగాలు?

praveen
గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక బంగారు గని అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు ఎంతోమంది పడరానీ పాట్లు పడుతున్నారు. పుస్తకాల పురుగుల్లా మారిపోయి నెలల తరబడి  ఒకే రూమ్ లో కూర్చొని ఏకంగా వందల పుస్తకాలు చదివినా.. కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం రావడం లేదు. ఇక ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించి ప్రయత్నించి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే కేవలం కష్టం మాత్రమే కాదు అదృష్టం కూడా కావాలి అని రియలైజ్ అయ్యి ఇక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్న వారు కూడా చాలామంది కనిపిస్తున్నారు.

 అయితే కొంతమంది ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి అనే కసితో ఏకంగా కోచింగ్ సెంటర్లు చుట్టూ కూడా తిరుగుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇలా కోచింగ్ సెంటర్లకు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు చాలామంది. అయితే నేటి రోజుల్లో ఉన్న పోటీ దృశ్య కోచింగ్ సెంటర్ కు వెళ్లకుండా గవర్నమెంట్ జాబు కొట్టడం అంత సులభమైన విషయమేమీ కాదు అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఎలాంటి కోచింగ్కు వెళ్లలేదు. కానీ ఒకేసారి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బుర్హాన్ పూర్ కు చెందిన మనీష్ చౌహన్ ఏకకాలంలో 4 బ్యాంకు ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు.

 మనీష్ చౌహాన్ తండ్రి సురేష్ చౌహాన్ రోజువారి కూలీ ఇక తల్లి పొలం పనులకు వెళ్తూ ఇక వచ్చిన దాంతోనే కుటుంబ పోషణ చూసుకుంటూ ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అటు మనీష్ కి మాత్రం ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కల ఉండేది. కానీ కోచింగ్ తీసుకునేంత ఆర్థిక స్తోమత లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. అప్పటికే బి ఏడ్ పూర్తి చేశాడు మనీష్. యూట్యూబ్లో పాఠాలను ఫాలో అవుతూ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ లో మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు  ఇలా విఫలమవడంతో అతనిలో కసి మరింత పెరిగింది. చివరికి ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఏకకాలంలో 4 ఉద్యోగాలు సాధించాడు. దీంతో అతని కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: