నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ కంపెనీలో ఖాళీలు... ?

VAMSI
మనకు రెండు సంవత్సరాలకు ముందు వరకు+ పరిచయం లేని ఒక కంటికి కనిపించని వైరస్ మన జీవితాల్లోకి ప్రవేశించి ఒక్కసారిగా మన మనుగడే ప్రశ్నార్థకం చేసింది. దాని బారి నుండి మన దేశం ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా కోలుకుంటోంది. కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను సగానికి పైగా తగ్గించుకున్నాయి. అంతే కాకుండా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది నిరుద్యోగులుగా మారిపోయారు. అలాంటి ఎంతో మందికి యిది ఓ మంచి అవకాశం అని చెప్పాలి. ఇంతకీ వివరాల్లోకి వెళితే భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కొన్ని పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ముంబైలో ఉన్న ఈ సంస్థలో దాదాపుగా 300 పోస్టులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మరో రెండు రోజులలో ఈ పోస్టులకు అప్లికేషన్ వేసుకోవడానికి వెసులుబాటును కల్పించారు. మరి ఇక్కడ ఏమి పోస్టులు ఉన్నాయి, అర్హత వివరాలు ఏమిటన్నది ఒకసారి చూద్దాం.
* ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే అన్ని పోస్టులు కూడా స్కేల్ 1 పోస్టులే కావడం విశేషం. అన్ని పోస్టులు కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లు మాత్రమే.
* ఇందుకు అర్హతను పొందాలంటే సదరు అభ్యర్థి డిగ్రీ/పీజీ లో 60 శాతం మార్కులను కలిగి ఉండాలి.
 
* ఒకవేళ మీలో ఎవరైనా డిగ్రీలో చివరి సెమిస్టర్ చదువుతున్నా దీనికి అప్లికేషన్ వేసుకోవడానికి అర్హులవుతారు.
*  అంతే కాకుండా మీ వయసు  01.04.2021 వ తేదీ రోజుకి 21 పైన నుంచి 30 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.
* ఆసక్తి కలవారు ఆన్లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
* ఈ పోస్టుకు ఎంపిక కావాలంటే మొత్తం మూడు స్టేజ్ లను దాటవలసి ఉంటుంది. మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి  మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ పరీక్షలో నెగ్గిన వారికి చివరగా ఇంటర్వ్యూ నిర్వహించి సంబంధిత పోస్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది.
* ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి నెలకు  రూ. 32,795 నుండి రూ. 62,315 వరకు జీతంగా చెల్లించడం జరుగుతుంది.
 
* ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి సమయం 01.09.2021 నుండి 21.09.2021 వరకు ఉంది.
మరి కొన్ని వివరాలకు అఫిషియల్ సైట్ ను చూడవలెను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: