ఓటమి ఎఫెక్ట్.. కొడాలి నానిని జగన్ పక్కన పెట్టేశారా?
వైసీపీలో ఫైర్ బ్రాండ్ లిస్ట్ కు కొదవే లేదు. అందులో ముందుగా వినిపించే పేరు మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. టీడీపీలో ఉంటూ పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ లో చేరారు. అనంతరం వైసీపీలో ఎనలేని ప్రాధాన్యం దక్కించుకున్నారు. మంత్రిగా కూడా పనిచేశారు.
తనకు గుడివాడలో తిరుగులేదని భావించారు. తనపై గెలవాలని రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ కూడా విసిరారు. ఇక వల్లభనేని వంశీ గురించి అయితే చెప్పే పనేలేదు. 2019 ఎన్నికల్లో సైతం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీలోకి ఫిరాయించారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని గురించి చెప్పనవసరం లేదు. శాసన సభలో.. బయట.. పార్టీ మీటింగ్ లు, విలేకరుల సమావేశాలు వేదిక ఏదైనా తనదైన శైలిలో చంద్రబాబుపై విరుచుకుపడేవారు.
వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. విచిత్రమేమంటే.. ఈ ఇద్దరూ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఎక్కడా కనీసం నోరు తెరవడం లేదు. కనీసం మీడియా ముందుకు కూడా వచ్చే సాహసం చేయడం లేదు. వల్లభనేని వంశీ కౌంటింగ్ సమయంలో కనిపించి.. భారీ ఓటమి తర్వాత కేంద్రం నుంచి బయటకు వచ్చేశాడు. ఆయన విదేశాలకు వెళ్లిపోయారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక కొడాలని నాని కొద్ది రోజులు అడపాదడపా కనిపించారు. పార్టీ అధినేత జగన్ తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో పెద్దగా కనిపించడం లేదు. పైగా వీరిద్దరిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అరెస్టు వరకు లేకుండా తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు వీరద్దర వ్యవహార శైలి చర్చకు దారి తీస్తోంది. పార్టీలోను పెద్దగా యాక్టివ్ గా లేరు. మరోవైపు వైసీపీ హైకమాండ్ కూడా వీరిని నియంత్రించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వరకు వాస్తవాలు ఉన్నాయో తెలియాలి.