కుప్పంలో చెమటోడ్చిన చంద్రబాబు.. తేడా కొడుతోందా?

ఏపీలో వైసీపీ ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు నాలుగు. ఇవి అందరికీ తెలిసిందే. పిఠాపురం, కుప్పం, హిందూపురం, మంగళగిరి. ఈ స్థానాల్లో పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేశ్ లు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో నారా లోకేశ్, పవన్ లు ఓడించిన వైసీపీ.. కుప్పం, హిందూపురంలో మాత్రం చేతులెత్తేసింది.

ఈ సారి ఎలాగైనా వీరిద్దరిని కూడా ఓడించాలని కంకణం కట్టుకుంది. అయితే ఇది అంత సులువా అంటే కష్టమే కానీ.. రాజకీయాల్లో ఏదైనా  జరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకి పెట్టని కోట.  1983లో టీడీపీ  ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు. 1989 నుంచి చంద్రబాబు వరుసగా ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఎనిమిదో సారి కూడా విజయం సాధించి తన పట్టుని బహిర్గతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఎన్నడూ నామినేషన్ పర్వానికి రాని చంద్రబాబు మరోసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి ఆయన తరఫున చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడ ప్రచార బాధ్యతలను నారా భువనేశ్వరి అన్నీ తానై వ్యవహరించారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు చేత పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ముందు చంద్రబాబు వరుసగా మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండిపోయారు.

ఇక్కడ ఇల్లు కట్టుకునేందుకు శంకుస్థాపన కూడా చేశారు. గతంలో ఎప్పుడూ ఆయన పీఏల చేత ప్రచారం చేయించి.. పార్టీ గెలుపు బాధ్యతను లోకల్ లీడర్లకు అప్పజెప్పేవారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనూహ్య విజయం సాధించడంతో పాత నాయకత్వాన్ని పక్కన పెట్టి.. కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించారు. దీంతో పాత, కొత్త ల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది.  మరోవైపు చంద్రబాబు మూడు సార్లకు పైగా కుప్పంలో పర్యటించారు.  ఈ సారి కుప్పంలో ఎన్నడూ లేనంతగా 90శాతం పోలిగ్ నమోదైంది.  ఇది ఎవరికీ లాభం చేకూరుస్తుందో చూడాలి.  ఫైనల్ ఇప్పటి వరకు ఎన్నడూ కష్టపడని విధంగా కుప్పంలో తన విజయం కోసం చంద్రబాబు శ్రమటోడ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: