చంద్రబాబు, అమిత్‌షా: పైకి పొత్తులు.. కడుపులో కత్తులు?

కేంద్ర బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ ఒక జంట. ఇద్దరూ కలిసే అన్నీ చేస్తూ ఉంటారు. మంత్రాంగం అంతా అమిత్ షా ది అయితే.. మోదీ గ్లామర్ తో బీజేపీ ని నడిపిస్తున్నారని విశ్లేషకులు అంటుంటారు. ఒక విధంగా చెప్పాలంటే మోదీ గ్లామర్ అయితే అమిత్ షా గ్రామర్. ఎక్కడెక్కడ పొత్తులు ఉంటాయి.

ఎవరినీ చేర దీయాలి. ఎవర్నీ ఎలా ఎంత దూరం పెట్టాలి ఇవన్నీ అమిత్ షానే పూర్తిగా చూస్తుంటారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు. బీజేపీలో పొత్తులు, ఎత్తులు అన్నీ కూడా ఈ త్రయమే చూసుకుంటూ ఉంటుంది. చంద్రబాబు బుట్టలో బీజేపీ అధిష్ఠానం పడిందని పలువురు పేర్కొంటున్నారు. కాకపోతే వాళ్ల వ్యూహం ఆషామాషీగా ఉంటుందా.. వీళ్ల గురించి తెలిసిన వారెవరూ కూడా ఈ వాదనకు ఒప్పుకోరు.

ఏపీలో బీజేపీని చంద్రబాబు నెత్తిన పెట్టుకోరు. కేవలం తన అవసరాల నిమిత్తం కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అదే క్రమంలో బీజేపీ కూడా చంద్రబాబుకి మేలు చేద్దాం. ఆయన్ను సీఎం చేద్దామని భావించదు. ఇద్దరి అజెండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం. ఒకవేళ కూటమి గెలిస్తే ఇరు పార్టీలు రాజకీయాల్లో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు యత్నిస్తాయి. ఓడితే.. టీడీపీ నాయకులు అంతా బీజేపీ పంచనకే చేరాలి. కేసులు, వ్యాపారాలు తదితర వాటిని రక్షించుకోవాలంటే వారికి బీజేపీనే దిక్కు. ఈ ప్లాన్ లోనే అమిత్ షా ఉన్నట్లు తెలుస్తోంది.

మరీ ఈ విషయాలు చంద్రబాబు కి తెలియదా. అంటే కచ్ఛితంగా తెలుసు. కాకపోతే ప్రస్తుతం బీజేపీ లేకపోతే ఆ పార్టీ పోల్ మేనేజ్ మెంట్ లో వెనుకపడుతుందనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఎవరి స్వార్థం వారిదే. బీజేపీకి మన అవసరం ఉంది. వాళ్లు మనకి కావాలి. ఈ నేపథ్యంలో ఈ సారి అధికారం దక్కించుకుంటే మనకి తిరుగుండదు అని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తంగా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.   ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: