రాహుల్‌ గెలుపు కోసం కాంగ్రెస్‌ జాగ్రత్తలు.. ఫలించాయా?

Chakravarthi Kalyan
కేరళలోని వయనాడ్ స్థానం దేశంలోనే ప్రతిష్ఠాత్మక సీట్ గా మారింది. అందుకు కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండో సారి అక్కడి నుంచి పోటీ చేయడమే. కాకపోతే ఈసారి ఆయన బలమైన ప్రత్యర్థులను ఢీ కొట్టబోతున్నారు. ఎల్ఢీఎఫ్ బలపర్చిన సీపీఐ అభ్యర్థి అనీరాజా. ఈమె సీపీఐ ప్రధాన కార్యదర్శి డిరాజా సతీమణి. ఇక బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ ను బరిలో దింపింది.

దీంతో ఇక్కడ ట్రాయంగిల్ ఫైట్ లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అందరికలో నెలకొంది. ఇక కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలతో కలిసి నడుస్తున్న కాంగ్రెస్.. కేరళలో మాత్రం సింగిల్ గానే బరిలలో నిలిచింది. అంతేకాదు కమ్యూనిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను ఎదుర్కొంటుంది.

ఎట్టకేలకు ఇక్కడ పోలింగ్ ముగిసింది. ఓటర్లు తమ అభ్యర్థిని ఈవీఎంలలో భద్రపరిచారు. ఇక ప్రచార విషయంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఆది నుంచి తగు  జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రౌండ్ లో పరిస్థితులు గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశారు ఏఐసీసీ నేతలు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. వయనాడ్ లో కాంగ్రెస్ జెండాలు పెట్టకుండానే  ఈసారి హస్తం పార్టీ బరిలో నిలిచింది.

కాంగ్రెస్ జెండాలతో ప్రచారం చేయాలన్నా.. నిలబెట్టాలన్నా ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లింది. కాంగ్రెస్ జెండా పెడితే మిగతా జెండాలు కూడా వెలుస్తాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. ఆ పార్టీ జెండాలు కూడా ఉంటేనే ఆ ఓట్లు టర్న్ అవుతాయి. ఇక్కడ 35శాతం ముస్లింలు, 13 శాతం మైనార్టీలు ఉన్నారు. ముస్లిం పార్టీ జెండాలను కాంగ్రెస్ వాడితే వాటిని గత ఎన్నికల్లో బీజేపీ ఉత్తర భారతదేశంలో ఉపయోగించి కాంగ్రెస్ ను దెబ్బతీసింది. అందుకే అవి లేకుండా జాగ్రత్త పడుతూ ఎన్నికలకు వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: