తెలంగాణ పల్స్.. రైతులే.. కేసీఆర్ ను ముంచేసారా?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైన బిఆర్ఎస్ ఇక ఇప్పుడు అటు పార్లమెంట్ ఎన్నికలలో ఎలా సత్తా చాటుతుంది. ఇదే విషయం గురించి ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక కారు పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా అధికార కాంగ్రెస్ లోకి వెళ్తున్న సమయంలో కారు పార్టీ మనుగడ కూడా కష్టతరంగా మారింది. ఇలాంటి సమయంలో ఉన్న నేతలను కాపాడుకోవడానికి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం.. ఆ పార్టీకి ఎంతో కీలకంగా మారిపోయింది.

 ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుంది అనే విషయం పైనే అంతట ఉత్కంఠ ఉంది అని చెప్పాలి. అయితే తాము తప్పకుండా 13 ఫీట్ల వరకు గెలుచుకుంటామని అటు ఆ పార్టీలోని కీలక నేతలు అందరూ చెబుతున్న.. ఇక తెలంగాణ రాజకీయ సమీకరణాలు చూసుకుంటే పరిస్థితి మాత్రం మరోలా ఉంది అన్నది అర్థమవుతుంది. మొదటినుంచి కెసిఆర్ పార్టీకి అటు రైతులే ప్రధాన ఓటు బ్యాంకుగా కొనసాగారు. ఇక రైతులను ఉద్దేశించి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చాయ్. కానీ మూడోసారి మాత్రం రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతే కేసిఆర్ ను సీఎం కూర్చికి దూరం చేసింది అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

 ఎందుకంటే రైతులను ఉద్దేశించి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలను ప్రవేశపెట్టింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి మరిచిన హామీలను టార్గెట్ చేసింది. బిఆర్ఎస్ రైతు భరోసా ఇచ్చిన హామీని మర్చిపోయిందని.. తాము ఇచ్చిన మొత్తాన్ని మాత్రం ఇస్తుందని ఎక్కడ ఈ పథకం కింద ఇచ్చే డబ్బులు పెంచలేదని.. ఇక ఇప్పటివరకు అటు రైతుల రుణమాఫీ కూడా చేయలేదు అంటూ ఇక కాంగ్రెస్  ఫై రైతుల్లో వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నాలు చేసింది బిఆర్ఎస్. ఇలా ధాన్యం కొనుగోలు చేయకపోవడం కరెంటు కోతలు.. కరువు రావడం అన్ని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా మారిన రైతులు అనుకూలంగా మారతారని బిఆర్ఎస్ అంచనా చేసింది. అంటే ఇప్పుడు పోలింగ్ సరలిపై నిర్వహించిన  సమీక్షలో మాత్రం షాకింగ్ విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుబంధు అందరికీ ఇచ్చేయడం, రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు 15లోకి చేస్తాను అంటూ హామీ ఇచ్చి ఇలా రైతులందరిని మరోసారి రేవంత్ పని వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారని.. ఇక ఇప్పుడు పోలింగ్ సమీక్షలో బయటపడిందట. దీంతో గ్రామీణ ప్రాంతా రైతులందరూ కూడా మరోసారి కాంగ్రెస్ వైపే నిలిచారు అన్నది తెలుస్తుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ కు షాక్ తప్పేలా కనిపించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: