వైసీపీ విక్టరీ: పోల్‌ మేనేజ్‌మెంట్‌లోనూ జగన్‌ టెక్నాలజీ?

మే 11న సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. అన్ని మైకులు మూగబోయాయి. నాయకులు తమ వంతు ప్రచారం చేసి. ఇక గెలిపించడం, ఓడించడం ఓటర్లకే వదిలేశారు. అయితే ఈ ఎన్నికలు అత్యంత కాస్ట్లీ గా మారాయి. అందులో ఓట్లు కొనుగోలు అనేది పెద్ద ప్రక్రియ. దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షనీరింగ్ అనే పేరు పెట్టుకోవడం విశేషం.

ఈ సారి ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రక్రియ జోరుగా సాగింది. నిజానికి ప్రచారం ముగిసిన రోజు రాత్రి గతంలో డబ్బులు ఇచ్చే వారు. ఈ సారి  అలా జరగలేదు. మూడు రోజుల ముందు నుంచే బూత్ ల వారీగా డబ్బుల పంపకాలు చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరికీ డబ్బులు పంచడమే ఈ ఎన్నికల విశేషం. అయితే అక్కడక్కడా తమకు డబ్బులు ఇవ్వలేదని పార్టీ నాయకుల కార్యాలయాలు చుట్టు ముట్టడం మనకి అక్కడక్కడా కనిపించింది.

ఈ డబ్బుల పంపిణీ క్రతువులో అటు వైసీపీ, ఇటు వైసీపీ ఎవరూ తక్కువ తినలేదు. ఓటుకు రూ.500 చెల్లించే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. మినిమం రూ.1000 నుంచి రూ.5వేల వరకు ఓటరు ధర పలికింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ సామాజిక వర్గ ఓట్లు మనకు పడవు.. అనుకొని రెండు పార్టీల నాయకులు డబ్బులు ఇవ్వడం మానేశారు.

వైసీపీ నాయకులు కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి డబ్బులు పంచలేదని సమాచారం. అలాగే టీడీపీ కూడా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే అభ్యర్థులు అందరికీ డబ్బులు లెక్కగట్టి ఇచ్చినా లోకల్ లీడర్లు వాటిని పంచకుండా నొక్కేశారు. ఇరు పార్టీల నాయకులు కూడా ఇలా డబ్బులు ఇవ్వకుండా తమ జేబులు నింపుకొన్నారు. వైసీపీ ఈ విషయంలో ఒక యాప్ ని మెయింటేన్ చేస్తూ.. అందులో పొందుపరిస్తే.. టీడీపీ మాత్రం లోకల్ లీడర్లనే నమ్ముకొంది. అందరికీ పంచమని పార్టీ నాయకులు చెబితే.. కొందరికీ మాత్రమే పంచి పై నాయకులను బురిడీ కొట్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: