పాలకుల చర్యలే సీమ పాలిట శాపం.. ఇలా చేస్తే మాత్రమే సీమ భవిష్యత్తు మారుతుందా?

Reddy P Rajasekhar
రాయలసీమ పేరు వింటే చాలామంది సీమలో కరువు జిల్లాలు ఎక్కువని, వర్షాలు సరిగ్గా కురవవని భావిస్తారు. పాలకుల చర్యలే సీమ పాలిట శాపం అని సీమవాసులు భావిస్తారు. సీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటి కంటే అధికంగానే కృష్ణ, తుంగభద్ర నదులలో సగటు ప్రవాహం ఉందని అయితే చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టులు కేటాయించిన నీటిని వినియోగించుకోలేక పోతున్నాయని తెలుస్తోంది.
 
రిజర్వాయర్ల నిర్మాణం, తగిన సామర్థ్యంతో కాలువల నిర్మాణం, చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్లే రాయలసీమకు ఈ పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ రైతులపై ప్రతి సంవత్సరం కరువు పంజా విసురుతోంది. సరైన సమయానికి వర్షాలు కురవక పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విత్తు తర్వాత రుతుపవనాలు ముఖం చాటేయడంతో ఇక్కడి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
 
సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే సీమ రైతుల బాధ అంతాఇంతా కాదు. రాయలసీమ ప్రాజెక్ట్ లకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తే మాత్రమే ఇక్కడి రైతుల భవిష్యత్తు మారుతుంది. రాయలసీమలో 8 జిల్లాల ప్రజలకు మేలు జరిగేలా పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంది. సీమలో తక్కువ వర్ష్ అపాతం ఉన్నా పండే పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే మంచిది.
 
ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాలను పెంచే దిశగా ప్రజల్లో సైతం మార్పు రావాల్సి ఉంది. ఎక్కువగా ఉండే ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిది. యువతను సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ దిశగా ప్రోత్సహిస్తే వాళ్ల కాళ్లపై వాళ్లు సొంతంగా నిలబడతారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు అయితే ఇక్కడి ప్రజలకు మరింత మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: