టీవీ -9 నీ.. సాక్షి స్వాధీనం చేసుకుందా.. అసలు నిజం ఇదే..!

Divya
గత కొద్దిరోజుల నుంచి టీవీ9 తెలుగు మీడియా  హౌస్ పైన పలు రకాల రూమర్లను క్రియేట్ చేస్తున్నారు. ఇతర భాషలలో కూడా టీవీ9 నెట్వర్క్ బాగానే విస్తరించి ఉంది. ముఖ్యంగా సాక్షి టీవీ యాజమాన్యం టీవీ9 ని టేకవర్ చేస్తోందని టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు.. అందుకు ముఖ్య కారణం ఈసారి టిడిపి పార్టీకి కాకుండా వైసిపి పార్టీకి టీవీ9 కాస్త సపోర్టుగా ఉందని విషయం పైన గ్రహించిన టిడిపి నేతలు ఈ విషయాన్ని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు.

అంతేకాకుండా రజనీకాంత్ ప్లేసులో నేమాని భాస్కర్ ఉండడం చేత మరింత వైరల్ గా చేశారు. సాక్షి ఎడిటర్ నేమినేని భాస్కర్ టీవీ9 బాధ్యతలు తీసుకున్నారని ఇకనుంచి సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలోనే టీవీ9 పనిచేస్తుంది అంటూ ఇన్ని రోజులకు ముసుగు తొలగిపోయింది అంటూ టిడిపి సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ కోసం టీవీ9 దిగజారిపోయింది అంటూ కూడా టిడిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. జగన్ బినామీలే టీవీ9 ని కొనుగోలు చేశారని విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు.

వీటితోపాటు ఎన్టీవీ, 10టీవీ కూడా సాక్షి పేపర్లో కలిసిపోతాయని కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.. ఒక దుష్ప్రచారాన్ని టిడిపి మీడియా వైరల్ గా చేస్తున్నడంతో ఇందులో ఎలాంటి నిజం లేదని టీవీ9 యాజమాన్యం ఈ విషయాన్ని తోసిపొచ్చింది.. టీవీ9 సాక్షి కొనుగోలు చేసిందని విషయం పైన ఎక్కడా కూడా అలాంటి ఆనవాళ్లు నివేదికలు కనిపించలేదని రెండు మీడియా సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రూపులుగా ఉన్నందువలన ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని తెలియజేశారు. తమ పరిశోధన తర్వాత టీవీ9 ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ తెలియజేశారు. ఇటీవల కాలం నుంచి అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళుతున్నారని ఇప్పటికే మీడియా రంగంలో టీవీ9 మంచి బెంజ్ మార్కును సెట్ చేసుకుందని తెలియజేశారు. టీవీ9 గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: