భారత ప్రధాని మోడీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..?
భారత ప్రధానమంత్రి మోడీ వద్ద పనిచేసే డ్రైవర్ల జీతం పే లెవెల్ 5 కింద రూ. 29,200 నుంచి రూ. 92,300 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఈ డేటా 2023లో పిఎమ్ఓ విడుదల చేసిన ప్రకారం,ఇందులో రూ 44,100 రూపాయల నుంచి రూ. 42,800 రూపాయల వరకు ప్రభుత్వం ప్రాథమిక జీతంగా ఉంటుందని, అలాగే పెన్షన్ మినహాయించి ఉంటుందని తెలుపుతున్నారు. మోడీ దగ్గర నలుగురు డ్రైవర్లు నియమిస్తారు అయితే ఇప్పుడు ఈ సంఖ్య మారినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా PMO కోసం పనిచేసే డ్రైవర్లను చాలా పగడ్బందీగా ఎంపిక చేయడం జరుగుతుంది.
వీరికి కారు నడపడానికి ముందు పరీక్షలలో ఉత్తీర్ణత కావాల్సి ఉంది. ముఖ్యంగా అత్యంత చురుకైన నైపుణ్యం కలిగిన డ్రైవర్లకు మాత్రమే ఈ ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే PMO లో పనిచేసేటువంటి వంట వారికి కూడా మంచి జీతం లభిస్తుంది. 2023 డేటా ప్రకారం వీరికి పే లెవెల్ 1 లో జీతాలను చెల్లిస్తారు. రూ. రూ.18 వేల నుంచి రూ .56,900 రూపాయల వరకు పొందవచ్చు. క్లర్క్ జీతం విషయానికి వస్తే.. రూ. 19,000 నుంచి రూ. 62,300 వరకు ఉంటుంది.అలాగే ప్రధానమంత్రి దగ్గర పనిచేసే ఇతర ఉద్యోగులు వారి ప్రభుత్వ ఉద్యోగం ఆధారంగా జీతభత్యాలను సైతం చెల్లిస్తారు.