దేశం వదిలిపోదాం అనుకున్నాం.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన నందు..!

Divya
తెలుగు బుల్లితెరపై నటుడుగా, హోస్ట్ గా మంచి పేరు సంపాదించారు నందు.నందు పలు షోలకి హోస్టుగా చేయడమే కాకుండా , పలు చిత్రాలలో నటించారు. ఇటీవలే నందు నటించిన తాజా చిత్రం సైక్ సిద్ధార్థ. ఈ చిత్రం జనవరి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా నందు మాట్లాడుతూ , తన జీవితంలో జరిగిన కొన్ని చేదు విషయాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. తను చేయని తప్పుకు తన పేరుని చాలాసార్లు వివాదాలలోకి లాగడం ఆ సమయంలో అనుభవించిన మానసిక వేదన కూడా తనని చాలా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు.


అలాంటి క్లిష్ట పరిస్థితులలో తన భార్య ప్రముఖ సింగర్ గీతామాధురి కూడా తనకు చాలా మద్దతుగా నిలిచిందని తెలియజేశారు. తన భార్య మాట్లాడిన మాటలు తనకి ఇంకా ఇప్పటికి గుర్తున్నాయని తెలిపారు. " మనకు బ్యాక్ గ్రౌండ్ లేకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి.. అన్ని వదిలేసి మనం వేరే దేశానికి వెళ్లిపోయి అక్కడ హోటల్లో పని చేసుకుని బతుకుదామని " తన భార్య గీతా మాధురి చెప్పిన మాటలు తనని ఇప్పటికీ కన్నీరు పెట్టించే అలా చేస్తాయంటూ తెలియజేశారు నందు.



గతంలో కొన్ని చిత్రాలు కేవలం డబ్బు కోసమే తప్పుడు కథలను ఎంచుకొని అందులో నటించాను, ఆ ప్రభావం తన కెరీర్ మీద చాలానే చూపించిందని తెలిపారు. అందుకే మూడు సంవత్సరాల పాటు విరామం తీసుకుని ఈసారి ఒక మంచి కంటెంట్ తో సైక్ సిద్ధార్థ సినిమాతో రాబోతున్నానని తెలిపారు. నెపోటిజం వల్ల అవకాశాలు రావచ్చు. ప్రతిభ లేకపోతే నెపోటిజం కూడా ఏమీ చేయలేదు. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలియజేశారు. తాను నటించిన ఈ కొత్త సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని దీంతో తనకు ఒక మంచి గుర్తింపు వస్తుందంటూ తెలియజేశారు నందు. ట్రైలర్ కూడా అద్భుతమైన స్పందన లభించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: