మోడీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారా.. పక్కానా?

Chakravarthi Kalyan
ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారని బీజేపీ చెబుతోంది. ఈ విషయంలో మోదీని ఎవరూ అధిగమించలేరని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నకాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోందన్న జి. కిషన్ రెడ్డి లోకసభ ఎన్నికల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకు సానుకూలత లేదని వెల్లడించారు.

కాంగ్రెస్ పాలనకు భాజపా పాలనకు పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని జి. కిషన్ రెడ్డి వివరించారు. ఏ రంగంలో కూడా భాజపాను తప్పు పట్టే అవకాశం లేదని.. మా పార్టీ పైనా తప్పుడు ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుందని జి. కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్, రేవంత్ కు అర్దరాత్రి కల వచ్చినట్లు భాజపా మానిఫెస్టో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జి. కిషన్ రెడ్డి విమర్శించారు.

రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారని జి. కిషన్ రెడ్డి తెలిపారు.  భాజపా-భారాసా ఒకటే అనడానికి ఒక్క సాక్ష్యం చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి జి. కిషన్ రెడ్డి సవాలు చేశారు. భాజపాను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని కిషన్ రెడ్డి అన్నారు. బిసి,ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీనే అని జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఎస్సీగా ఉన్న రామనాధ్ కోవింద్, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది భాజపా పార్టీని జి. కిషన్ రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంలో 27 మంది బిసి మంత్రులు, 12 మంది ఎస్సీ మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులుగా పని చేస్తున్నారని జి. కిషన్ రెడ్డి వివరించారు. సిద్దిపేటలో జరిగిన కేంద్రమంత్రి అమిత్ షా  ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసిన సామాజిక మాద్యంలో వైరల్ చేస్తున్నారని జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబేడ్కర్ ఆశయలతోనే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని జి. కిషన్ రెడ్డి తెలిపారు. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారంటీనా అని జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: