పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క శెట్టి.. వరుడు ఆ నిర్మాతే..?

Suma Kallamadi
విక్రమార్కుడు, బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ పాపులర్ అయిన అందాల తార అనుష్క శెట్టి ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 42 ఏళ్ళు ఈమె ప్రభాస్ ని పెళ్లి చేసుకోనుందని ఇంతకుముందు రూమర్స్ వచ్చాయి కానీ వాటిని అనుష్క ఖండించింది. ఆమె నాగార్జునతో కూడా ఆ పేరు పెట్టుకున్నట్టుగా రూమర్స్ వచ్చాయి. వీటిలో నిజం లేదని తాము కేవలం స్నేహితులమేనని నాగార్జున చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. అయితే అనుష్కకు 35 ఏళ్లు దాటిన సమయం నుంచి ఆమె పెళ్లి ఎప్పుడు అని అడగడం స్టార్ట్ చేశారు.
అయితే ఆ ప్రశ్నలన్నిటికీ అనుష్క చెక్ పెట్టబోయే రోజులు దగ్గర పడ్డాయని తెలుస్తోంది. ఆమె ఒక కన్నడ నిర్మాతను పెళ్లి చేసుకోనున్నారని ప్రస్తుతం వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాత ఎవరనేది ఏమీ తెలియలేదు కానీ ప్రొడ్యూసర్ తో ఆమె పెళ్లి కుదిరినట్లు ఒక వార్త షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో దావానలంగా వ్యాపిస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. అనుష్క కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఏ నిర్మాతతో లవ్ అఫైర్ నడిపి ఉంటుంది? ప్రభాస్ ని కాదని వేరే వ్యక్తిని ఆమె ఎందుకు పెళ్లి చేసుకోబోతోంది? అనే కోణంలో ఫ్యాన్స్ ఇప్పుడు ప్రశ్నలను సంధిస్తున్నారు. వీటన్నిటికీ త్వరలోనే సమాధానం లభించే అవకాశం ఉంటుంది.
అనుష్క ఇప్పటికే 42 ఏళ్ళు వచ్చాయి. ఇంకాస్త సమయం గడిచిపోతే ఆమెకు పెళ్లీడు కూడా దాటిపోయే అవకాశం ఉంది. కన్నడ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ తో ఆమె పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ త్వరలో ఆమె కచ్చితంగా మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభాస్ పెళ్లి కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయన కూడా అతని పెళ్లి మేము చాలా ఏళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నాడు. అనుష్క ప్రస్తుతం సినిమాల్లో నటించడం కూడా తగ్గించింది చివరిసారిగా "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమాతో ఒక హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమె కొత్త సినిమాని ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: