''జబర్దస్త్'' కు ఎండ్ కార్డ్....విషాదంలో కమెడియన్స్..!!

murali krishna
బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.తెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా ఎటువంటి బ్రేక్ లేకుండా తిరుగులేని షోగా జబర్దస్త్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షోలో కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది స్టార్ కమెడియన్స్ గా, హీరోలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.మొదట జబర్దస్త్ గా స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో రెండో రోజు కూడా ప్రసారమవడం మొదలైంది. ఇలా చాలా ఏళ్లుగా కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్న జబర్దస్త్ షో పూర్తిగా ఆగిపోతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రోమోలో టీం ప్రకటించారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2013లో జబర్దస్త్ ప్రారంభమైంది.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది నటులు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీస్ గా మారారు.అదే టైంలో జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు, ఇంద్రజ కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. వాళ్లు మాత్రమే కాదు ఈ ఆ షోకు యాంకర్‌గా వ్యవహరించిన రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్ స్టార్ యాంకర్లుగా పాపులర్ అయ్యారు. అయితే మెల్లమెల్లగా మొదట జడ్జెస్, తర్వాత యాంకర్స్ మారుతూ వెళ్లిపోవడంతో షోలో కుదుపులు మొదలయ్యాయి. మొదటి నుంచి ఈ షోకు జడ్జిల్లా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా షో నుంచి విడిపోవడంతో మొదటి జనరేషన్ కమెడియన్స్ కూడా ఈ షో మానేసి వెళ్లిపోయారు. దీంతో జడ్జిలు, యాంకర్లు, టీం లీడర్లు, కమెడియన్లు కొత్తవాళ్లు వచ్చి షోను మరింత ఫన్నీగా నడిపే ప్రయత్నాలు చేశారు.
 అయితే తాజాగా ఇంద్రజ కూడా ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోతుందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ఇంద్రజ హైలెట్ గా ఉందన్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈమె షోను సక్సెస్ చేయడంలో తన వంతు పాత్ర పోషించింది. కానీ వచ్చేవారం నుంచి జబర్దస్త్ లో ఇంద్రజ తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ప్రోమోలో చూపించారు. అలానే షో మొత్తాన్ని కూడా ఆపేస్తున్నారట మేకర్స్. ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత లాక్ డౌన్ సమయంలో తప్ప ఎప్పుడూ ఆగకుండా నిరంతరాయంగా కొనసాగింది. కానీ ఇప్పుడు ఈవారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేస్తున్నట్లు.. ఇకపై గురు, శుక్రవారం జబర్దస్త్ మాత్రమే ప్రసారమవుతున్నట్లు తాజా ప్రోమోలో వివరించారు.ఆటో రాంప్రసాద్ తన స్కిట్ ద్వారా ఎక్స్ట్రా జబర్దస్త్ ను ఆపేస్తున్నట్లు వివరించాడు. మాకు రెండు కంపెనీలు ఉన్నాయి.. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఒకటే చేసేస్తున్నాం అంటూ మ్యాటర్‌ వివరించాడు. అసలు ఎందుకిలా చేశారో.. అంటూ రాంప్రసాద్ మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎలా ఉంటుంది.. ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. అనంతరం యాంకర్ రష్మీ ఎక్స్ట్రా పదం మిస్ అవుతుంది.. కానీ రెండు ఎపిసోడ్స్ వస్తాయి అంటూ వివరించింది. మొత్తానికి ఈ షో రెండు రోజులు వచ్చిన ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది మాత్రం ఉండదు.. జబర్దస్త్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: