వైసీపీ : ఏందీ బాలయ్య...మహిళలంటే అంత చులకనా.. ?

Veldandi Saikiran
రెండు తెలుగు రాష్ట్రాలలో నందమూరి బాలయ్య గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ స్టార్ హీరోగా అలాగే...తెలుగుదేశం ఎమ్మెల్యేగా దూసుకు వెళ్తున్నారు నందమూరి బాలయ్య. అయితే రెండు రంగాల్లో రాణిస్తున్న... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఆయన ఈ మధ్యకాలంలో ఏది చేసిన సంచలనం అవుతుంది.
కొన్ని సందర్భాలలో వివాదంగా మారుతుంది. సెల్ఫీల కోసం వచ్చిన ఫ్యాన్స్ ని కొట్టడం...  ఏదైనా ఈవెంట్ కు వెళ్లిన తర్వాత మైక్ పట్టాడంటే... ఏవో కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం బాలయ్యకు అలవాటు. వీటన్నిటినీ బాలయ్య ఫ్యాన్స్ పెద్దగా సీరియస్గా తీసుకోరు. కానీ బాలయ్య అంటే గిట్టని వారు... సోషల్ మీడియాలో ఆయనపై దారుణంగా ట్రోల్ చేస్తారు. అయితే సరిగ్గా... ఇప్పుడు అదే జరిగింది.

హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. విశ్వక్సేన్  ప్రస్తుతం చేస్తున్న సినిమా గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నటుడు నందమూరి బాలయ్య... ముఖ్యఅతిథిగా వచ్చారు. అయితే ఇక్కడే పెద్ద వివాదం చోటు చేసుకుంది. స్టేజ్ పైకి ఎక్కగానే హీరోయిన్ అంజలిని తోసేశారు బాలయ్య. వాస్తవానికి... సరదాగా హీరోయిన్ అంజలిని...  నందమూరి బాలయ్య తోసేసినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో అంజలి నవ్వుతూ కూడా ఉండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
అనంతరం హీరోయిన్ అంజలితో మళ్ళీ ఏదో మాట్లాడి సరదాగా కనిపించాడు బాలయ్య. అటు బాలయ్య ప్రశ్నలకు అటు సరదాగానే అంజలి సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కానీ ఈ అంశాన్ని వైసిపి సోషల్ మీడియాలో దారుణంగా వాడుతోంది. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ మరోసారి అసభ్యంగా ప్రవర్తించాడని... వైసిపి మండిపడుతోంది. మంగళవారం జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మద్యం తాగి మహిళలతో అసభ్యంగా బాలకృష్ణ... ప్రవర్తించాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది వైసిపి. మహిళ లాంటే అంత చులకన అంటూ... బాలయ్య ను ట్యాగ్ చేసి మరి ఫైర్ అవుతున్నారు.. వైసిపి కార్యకర్తలు.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: