ఏపీ:ప్రభుత్వ స్కూల్స్ వైపు విద్యార్థుల అడుగు..జగన్ మామయ్య మహిమేనా..?

Divya
చాలామంది తమ పిల్లలకు నిజమైన ఆస్తి కేవలం చదువు మాత్రమే అంటూ తెలియజేస్తూ ఉంటారు. వేల కోట్లు కూడబెట్టిన కూడా సామర్థ్యం లేని వారి చేతిలో పెడితే కచ్చితంగా అతి తక్కువ సమయం లోనే ఆస్తులు కరిగిపోతాయని చెప్పవచ్చు.. దీంతో చివరికి అప్పుల పాలు కావాల్సి ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు. అందుకోసమే తమ బిడ్డలకు చదువే అసలైన ఆస్తి అన్నట్టుగా భావిస్తూ ఉంటారు చదువుకుంటే భరోసా, బ్రతకగలమని ధైర్యం కూడా ఉంటుంది. ఇదే విషయాన్ని గుర్తించి చాలా బలంగా నమ్మారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

వారికి నాణ్యమైన విద్య అందిస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తు గురించి ఏలాంటి భయం ఉండదని చాలా బలంగా నమ్మారు. కానీ ఈ కాలంలో నాణ్యమైన విద్య అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం చదువులంటే.. లక్షలలో ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉన్నది. ధనవంతులైతే ఎలాగోలాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి పేదలు మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఈ విషయంలో దారుణంగా ఉంటుంది.
అందుకే ఆంధ్రప్రదేశ్ స్కూల లో ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాని అమలు చేయడమే కాకుండా.. వారికి అవసరమైనటువంటి వాటిని అమలు చేస్తూ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయాన్ని పక్కాగా అమలు చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలని మార్చేసి కార్పొరేట్ స్కూల్లకు దీటుగా తీర్చిదిద్దారు. ప్రైవేట్ స్కూళ్లకు పంపించే తల్లితండ్రులు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించారా ఓటు వేస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఏడాది ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్స్ చూస్తే చాలా స్పష్టమవుతుంది. ప్రతి ఏడాది కూడా వేసవి సెలవుల ప్రారంభం నుంచి ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేవి. కానీ ఏడాది ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ తీసుకున్న వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా మంచి విద్య భోజనం ఇంగ్లీష్ మీడియం వంటి సదుపాయం పెరగడంతో గవర్నమెంట్ స్కూల్ అయితే మగ్గుచూపుతున్నారు. అయితే ఇవన్నీ జగనన్న తీసుకువచ్చిన మార్పులే అని .. ఆయన అమలు చేసిన సంస్కరణ ఫలితమే అందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: