గుణశేఖర్ కొత్త సినిమాకు అదిరిపోయే టైటిల్..!!

murali krishna
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. చూడాలని వుంది, ఒక్కడు, రుద్రమాదేవి వంటి ఎన్నో ఎన్నో గొప్ప చిత్రాలను అందించారు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు.తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్‌ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు.తన సొంత బ్యానర్ అయిన గుణ టీమ్‌వర్క్స్‌పై దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన కొత్త సినిమాకి 'యుఫోరియా' అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి నీలిమా గుణ నిర్మాతగా వ్యవహరించనున్నారు.కేవలం టైటిల్ ను మాత్రమే ప్రకటించడం జరిగింది, ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. నీలిమా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతోన్న ఈ ప్రాజెక్ట్‌లోని నటీనటుల వివరాలను టీమ్‌ త్వరలోనే ప్రకటించనుంది. రేపు ఉదయం 11 గంటలకు సినిమా విశేషాలు తెలియజేయనున్నట్టు చెప్పాడు. మీ అందరి కోసం ఓ ఎక్జయిటింగ్ అప్‌డేట్ వేచి ఉంది..తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచింది.చూడాలని ఉంది', 'ఒక్కడు', 'రుద్రమదేవి' వంటి ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు గుణశేఖర్‌. చివరిసారి 'శాకుంతలం'తో ప్రేక్షకులను పలకరించారు. పౌరాణిక చిత్రంగా తెరకెక్కిన ఇందులో స్టార్‌ హీరోయిన్ సమంత నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ గుణశేఖర్‌ మేకింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. దాని తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న ఆయన తాజాగా 'యుఫోరియా'తో మరోసారి తన మార్క్‌ చూపేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: