వేణుస్వామి: ఏపీకి మరొకసారి జగనే సీఎం.. కానీ..?

Divya
టాలీవుడ్ లో సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ జోష్యం చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు వ్యవహారం వల్ల వేణు స్వామి పేరు మరింత పాపులారిటీ సంపాదించింది. ఇక ఆప్పటినుంచి ఇప్పటివరకు వైరల్ గా మారుతూనే ఉన్నారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు తధ్యమని జనసైనికులు చెప్పుకుంటున్నప్పటికీ.. వేణు స్వామి మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ యోగమే లేదంటు జోష్యం చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే వ్యక్తులలో తాను కూడా ఒకరని కానీ ఆయన రాజకీయాలకు పనికిరారు అంటూ వెల్లడించారు. ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలని ఆశ తనకు కూడా ఉందని కానీ ఆయన కుటిల రాజకీయాలు తెలియవు కాబట్టే ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు అంటు వేణు స్వామి వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ సినిమాలకి అంకితం అవుతారని కూడా వెల్లడించారు.. అభిమానులు పవన్ కళ్యాణ్ మీద 100% రాజకీయా అంచనాలు పెట్టుకుంటే.. కేవలం 20 శాతం మాత్రమే రిజల్ట్ ఉంటుందంటూ వెల్లడించారు.

ఆంధ్రాలో మరొకసారి జగన్ అధికారంలోకి వస్తారని ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా వేణు స్వామి తెలియజేశారు.ఇప్పుడు మళ్లీ కూడా అదే విషయాన్ని తెలిపారు.. రోజా, అంబాటి రాంబాబు, అమర్నాథ్ వంటి నేతలకు కూడా గట్టి పోటీ ఉంటుందంటూ వెల్లడించారు. అయితే జగన్ గెలిచిన తర్వాత కూడా ఆయనకు కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని వేణు స్వామి వెల్లడించారు.అయితే అది ఈడీనా లేక సిబిఐ అనే విషయం మాత్రం తాను చెప్పలేనని కూడా వెల్లడించారు.జగన్ రెండోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని కూడా తెలియజేశారు వేణు స్వామి.. ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆచార్యానికి గురి చేస్తున్నాయి.. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: