టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈయన నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ "పెళ్లి సందD" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత రోషన్ నెక్స్ట్ మూవీ కి కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా రోషన్ "ఛాంపియన్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను స్వప్న సినిమాస్ సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ కోసం స్వప్న సినిమాస్ సంస్థ వారు భారీ ఎత్తున ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఏకంగా 45 కోట్ల ఖర్చు ను స్వప్న సినిమాస్ సంస్థ వారు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక చిన్న హీరో సినిమాకు 45 కోట్ల ఖర్చు పెట్టడంతో స్వప్న సినిమాస్ సంస్థ చాంపియన్ సినిమా విషయం లో చాలా పెద్ద రిస్క్ తీసుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం స్వప్న సినిమాస్ సంస్థ వారు మంచి సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక మంచి కథ అయి ఉంటుంది. అందుకే వారు ఆ స్థాయిలో బడ్జెట్ను ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఛాంపియన్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి , ఏ స్థాయి విచారి సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.