విచిత్రం: జగన్‌ పాలనను తెగమెచ్చుకుంటున్న పచ్చ పత్రికలు?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ కి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తుంటాయి. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ప్రజా వ్యతిరేకతను పెంచేలా సమగ్ర వివరాలతో కథనాలను ప్రచురిస్తున్నాయి. అయితే వీటిని అధికార పార్టీ అనుకూల పత్రిక ఫ్యాక్ట్ చెక్ పేరుతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరి వార్తలను తిప్పికొట్టేందుకు ప్రత్యేకంగా ఒక పేజీని పెట్టి మరీ గట్టిగానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసే క్రమంలో వైసీపీ చేసిన మంచి పనులను కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ దిగజారిందని.. నాడు నేడు ద్వారా భారీ అవినీతి జరిగిందని.. ఆన్ లైన్ విద్యాబోధన పేరిట ప్రైవేట్ సంస్థలను వందల కోట్ల రూపాయలు దోచి పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారంటూ ప్రత్యేక కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జగన్ వచ్చాక పాఠశాలలు మూత పడ్డాయంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

ఈ రోజు ఎల్లో మీడియాలో వచ్చిన కథనాన్ని పరిశీలిస్తే..  గతంలో ప్రభుత్వ పాఠశాలలు 45013 ఉండేవి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 44426 పాఠశాలలు ఉన్నాయి. అంటే మొత్తం 513 స్కూల్స్ తగ్గాయి. దీనిని బట్టి చూసుకుంటే వేలాది పాఠశాలలు మూసేశారు అనేది అబద్ధం అవుతుంది. మరో విషయం ఏమిటంటే.. వీటిని కూడా మూసేయలేదు. పలు చోట్ల మెర్జ్ చేశారు.

ఇదే సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు 1274 వరకు మూత పడ్డాయి. అంటే సర్కారు పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నట్లే లెక్క. సహజంగా పిల్లలు రాకపోతే ఆయా ప్రైవేట్ పాఠశాలలకు నష్టం వచ్చి వీటిని మూసేస్తుంటారు. ఎయిడెడ్ పాఠశాలలు 1365 మూసివేశారు. ఇతర బడులు 269ని క్లోజ్ చేశారు. మొత్తంగా ఈ లెక్కలు చూసుకున్నట్లయితే జగన్ విద్యావ్యవస్థలో తెచ్చిన మార్పుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల ఆదరణ పెరిగింది. ఈ లెక్కలే వాటికి ఉదాహరణ. వైసీపీకి చెడు చేద్దామని భావిస్తే.. జగన్ కు ఫేవర్ చేసిపెట్టినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: