జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చెల్లెళ్లు?

కడపలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిళ యాక్టివ్ అవుతూ తన అన్న సీఎం జగన్ ను ఇరుకున పెడుతున్నారు. మరోవైపు వివేకా కుమార్తె కూడా షర్మిళ వెంట నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన తండ్రి హత్య కేసులో ఆమె ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. సునీతకు పలు సందర్భాల్లో షర్మిళ అండగా నిలిచారు.

ఇప్పుడు సునీత జగన్ పై యుద్ధం ప్రకటించారు. తన తండ్రి హత్య విషయంపై ఇక ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దిల్లీ వెళ్లి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న జగన్ కు మరోసారి ఓటు వేయోద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. గత ఐదేళ్లుగా వివేకా హత్య విషయమై సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.

సీబీఐ చురుగ్గా పనిచేసే సమయంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర గురించి కూడా చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. కానీ ఆయన అరెస్టు విషయంలో మాత్రం సీబీఐ వెనకడుగు వేసింది. అటు కేసు ముగించేయాలని అన్న సుప్రీం తీర్పునకు కూడా అతీగతీ లేకుండా పోయింది. దీంతో సునీత న్యాయ పోరాటంతో పాటు ప్రజా క్షేత్రంలో పోరాడాలని నిర్ణయించుకున్నారు.

2017 ఎన్నికల్లో సొంత వారే వివేకాకు వ్యతిరేకంగా పనిచేశారని.. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారనే తన తండ్రిని హతమార్చారు అని సునీత మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇంతేకాకుండా జగన్ ను నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మాట మీద నిలబడతా.. విశ్వసనీయత  అంటూ చెబుతుంటారని.. కానీ ఈ చెల్లికి ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని సీఎంను ప్రశ్నించారు. మొత్తానికి ఈ కేసు విషయంలో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్ కు ఇవి ఇబ్బందికర పరిణామాలే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: