జనసేనకు సైలెంట్‌గా టీడీపీ దెబ్బ పడిపోతోందా?

టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. మంచి ముహూర్తం చూసుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా.. జనసేన ఫైనల్ నెంబర్‌ను ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా పక్కాగా ప్లాన్ చేసినట్లుగా 94 మంది అభ్యర్థులని ప్రకటించారు. సభలకు సెలవులు పెట్టి మరీ చేసిన కసరత్తులు న్యాయం చేసినట్లుగా కనిపిస్తోంది.

ఇక పవన్ విషయానికొస్తే 175 స్థానాల్లో 24 మంది అభ్యర్థులతో సరిపెట్టుకున్నారు. సీట్లు ముఖ్యం కాదు పొత్తు ముఖ్యం అనే రీతిలో ఈ స్థానాలు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. దీంతో జనసైనికులను ఏమార్చే పని ఇప్పటికీ ఆపలేరా అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. పోనీ పోటీ చేసే 24 స్థానాల్లో కూడా  అభ్యర్థులు ఎవరు అనే విషయం ప్రకటించలేదు. కనీసం ఆ 24 నియోజకవర్గాల పేర్లు ఏమిటో కూడా పవన్ చెప్పకపోవడం గమనార్హం.

ఈ సమయంలో ఆ 24 స్థానాల్లోనూ తెనాలి-నాదెండ్ల మనోహర్, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, రాజానగరం-బత్తుల రామకృష్ణుడు, కాకినాడ రూరల్ –పంతం నానాజీ, నెల్లిమర్ల – లోకం మాధవి పోటీ చేస్తారని 5గురి పేర్లు ప్రకటించారు. దీంతో మిగిలిన 19 స్థానాలపై క్లారిటీ రాలేదా.. లేక అభ్యర్థలపై స్పష్టత రాలేదా అనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో పాటు పొత్తుల సర్దుబాటు కోసం ఇందులో మరికొన్ని స్థానాలను టీడీపీకి ఏమైనా త్యాగం చేస్తారా అనే వ్యంగాస్త్రాలు సైతం వినిపిస్తున్నాయి.

మరోవైపు చంద్రబాబు ప్రకటించిన 94 మంది అభ్యర్థులు వెంటనే నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తారు.  ఆయా స్థానాల్లో స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. కానీ జనసేన విషయంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అసలు జనసేనాని పోటీ చేసే స్థానంపైనే ఇంకా స్పష్టత రాలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా అసుల సిసలు రాజకీయాలను పవన్ ఎప్పుడు వంట పట్టించుకుంటారో అని కొందరు పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: