కార్పొరేట్ రాజకీయం వైసీపీకి లాభమా.. నష్టమా?

రాజకీయ పార్టీకి ప్రజలే ముఖ్యం. ప్రజల్లో లేని పార్టీని ఏ వ్యూహకర్తా అధికారంలోకి తీసుకు రాలేరు. మన దేశంలో 90వ దశకం నుంచి నాయకులు సర్వేలపై.. వ్యూహకర్తలపై ఆధారపడటం పెరుగుతూ వచ్చింది. ఇదంతా ఒకప్పుడు తెరచాటు వెనుక సాగే కథగా ఉండేది. ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు వంటి వ్యూహకర్తలు ఇప్పుడు దానిని ముందుకు తీసుకువచ్చి రాజకీయాన్ని పొలిటికల్ బిజినెస్ గా మార్చేశారు.

ఒక వస్తువును అమ్మినట్లు.. వ్యూహకర్తలు తమ టీమ్ తో హైప్ ని సృష్టిస్తూ రాజకీయ పార్టీలను, అభ్యర్థులను తన క్లైంట్స్ గా చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో వ్యూహకర్తలు లేకుంటే గెలిచే పరిస్థితి లేదనే వాతావరణాన్ని సృష్టించారు. అయితే రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చేయాలి.  ఆయా పార్టీలు రాజకీయ పార్టీలగా మాత్రమే వ్యవహరించాలి. కానీ ఎవరు ఎమ్మెల్యే అవ్వాలో.. ఎవరు మంత్రి అవ్వాలో రాజకీయ వ్యూహకర్తలు డిసైడ్ చేస్తున్నారు. ఇది ఒక విచిత్రం.

ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజలను సంతృప్తి పరిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి వైసీపీ అతీతమేమీ కాదు. ఆ పార్టీ మెల్లగా కార్పొరేట్ రాజకీయాల వైపు మళ్లుతోంది. గతంలో చంద్రబాబు చేసిన విధానంలోకి ఇప్పుడు ఆ పార్టీ మారబోతోంది. కార్యకర్తలకు పార్టీ చేసిన మేలును బట్టి వాళ్లు ఆపార్టీని విశ్వసిస్తారు. ఆ తర్వాత తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు ఏం మేలు చేసిందో వివరిస్తారు.

కానీ విచిత్ర పరిస్థితి ఏంటంటే పార్టీ కార్యకర్తలను మోటీవేటర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలను టీడీపీ చేపట్టగా.. ఇప్పుడు వైసీపీ అదే ఫార్ములాను అనుసరిస్తోంది.  తాజాగా కడపలో, పులివెందులలో ఓ మోటివేటర్ తో శిక్షణ ఇప్పించింది. సాధారణంగా ఉద్యోగులు పనితీరు సరిగా లేకుంటే కార్పొరేట్ సంస్థలు ఈ తరహా క్లాసులు ఇప్పిస్తుంటారు. ఇప్పుడు ఇది రాజకీయాలకు అంటుకుంది. దీనిని వైసీపీ అమలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: