టికెట్ల లొల్లి: బాబుకు జగన్‌కు అదే తేడా?

టీడీపీ అధినేత అయితే అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు అదే జగన్ అయితే ఏకపక్షంగా నియంతలా వ్యవహరిస్తారు అని ఎల్లో మీడియా చెబుతూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్లయితే బీజేపీతో పొత్తు వ్యవహారం ఎవరితో చర్చించారు. అలాగే జనసేనతో పొత్తు ప్రకటన సమయంలో ఎవరిని సంప్రదించారు. కాకపోతే వీటిని ఎల్లో మీడియా హైలెట్ చేయదు.

అదే సీఎం జగన్ అయితే నిర్మొహమాటంగా మెహం మీదనే చెప్పేస్తారు. అన్నా నీకు ఈ కారణం చేత సీట్లు ఇవ్వడం లేదు అని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని నేరుగా మాట్లాడి చెబుతారు. దీనిని నియంతృత్వం అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ వస్తోంది.  అదే చంద్రబాబు అయితే తన అనునూయుల చేత మాట్లాడించి ఆ తర్వాత విషయం చెప్పిస్తారు. కేశినేని నాని విషయంలో జరిగిందిదే.

మరోవైపు జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయిట్ మెంట్ ఇవ్వడం లేదు అనే విస్త్రృత, నెగిటివ్ ప్రచారం చేయగలిగారు. అయితే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కొందరితో సీఎం జగన్ కాసేపు మాట్లాడారు. శాసన సభ వాయిదా పడిన తర్వాత తన ఛాంబర్ కు సీఎం వెళ్తున్న సమయంలో సంభాషణ చోటు చేసుకుంది. అయ్యా జగన్ నీకు దండం అంటూ సెల్యూట్ చేసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ని చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు సీఎం దగ్గరికి తీసుకెళ్లగా ఏమన్నా కాపన్నా కోపమా అన్నా.. ఎందుకన్నా పైకి రా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని అన్నారు.

సీటు విషయంలో అసంతృప్తిగా ఉన్న మంత్రి గుమ్మనూరి జయరాం, మల్లాది విష్ణు, మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ పరిస్థితుల వల్ల నిర్ణయం తీసుకున్నాం. మనమంతా ఒక కుటుంబం. మీరంతా ఉంటేనే కదా నేనుండేది. ఇంకేంటబ్బా విశేషాలు అంటూ అక్కడ ఉన్న వారిని ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. టీడీపీ  ఈ సారి రాజ్యసభ అభ్యర్థిని బరిలో దించనుందనే వార్తలు వస్తున్ననేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేలను ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు అని.. తద్వారా జగన్ భయపడ్డారు అనే కోణంలో ఎల్లో మీడియా చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: